For Money

Business News

రూ.50,000లోపు బంగారం!

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ స్వల్పంగా తగ్గినా బులియన్‌ ధరలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. రాత్రి ఎంసీఎక్స్‌ ఫార్వర్డ్‌ మార్కెట్‌లో బంగారంపై ఒత్తిడి వచ్చింది. ఒకదశలో 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 49,881కి పడింది. ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం, బాండ్ ఈల్డ్స్‌ పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లపై మక్కువ చూపుతున్నారు. రాత్రి క్లోజింగ్‌ సమయానికి బంగారం స్వల్పంగా కోలుకుని రూ. 50,145 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర. ఇక కిలో వెండి ధర కూడా (డిసెంబర్‌ కాంట్రాక్ట్‌) ఒకదశలో రూ. 55,700లకు పడిపోయింది. అయితే క్లోజింగ్‌లో రూ.450 నష్టంతో రూ. 50,145 వద్ద ముగిసింది. అయితే ఇవాళ మార్కెట్లు కాస్త పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. డాలర్‌ రాత్రి మరింత క్షీణించడమే దీనికి కారణం. ఈ ధరలన్నీ ఎంసీఎక్స్‌ ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ ధరలు. స్పాట్‌ మార్కెట్‌ ధరలు కావు.
కొనండి కానీ…
డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ బంగారం కొనుగోలు చేయొచ్చని.. అయితే ధర తగ్గిన తరవాత కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం కాంట్రాక్ట్‌ రూ.49800 లేదా 49850 ప్రాంతానికి వచ్చినపుడు కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. రూ. 49750 స్టాప్‌లాస్‌తో రూ. 50203 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. రూ. 50,355 దాటితే రూ. 50775 దాకా వెళ్ళే అవకాశముంది.