For Money

Business News

గోల్డ్‌ ఏటీఎంలు వచ్చేస్తున్నాయ్‌

గోల్డ్‌ సిక్కా అనే సంస్థ ప్రత్యేక గోల్డ్‌ ఏటీఎంను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. వచ్చే 45 రోజుల నుంచి 50 రోజుల్లో హైదరాబాద్‌లోని పాతబస్తి, సికింద్రాబాద్‌, అబిడ్స్‌లలో మూడు గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రమోటర్‌, సీఈవో సై తరూజ్‌ తెలిపారు. దీని కోసం చెన్నైకు చెందిన టెక్నాలజీ సంస్థ తృణిక్స్‌ డాటావేర్‌ ఎల్‌ఎల్‌పీ, కేఎల్‌ హై-టెక్‌ సెక్యూర్‌ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. కంపెనీ జారీ చేసిన ప్రీపెయిడ్‌ కార్డులతో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఎంతైనా బంగారాన్ని ఈ ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. వీటిలో పదిగ్రాముల వరకు నాణేల రూపంలో లభించనుండగా..మిగతా 20, 50, 100 గ్రాములు కలిగిన బార్ల రూపంలో లభించనున్నాయి. ఒక్కో ఏటీఎంలలో 5 కిలోల వరకు బంగారం ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. నెలకు 200 నుంచి 300 ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నది. వచ్చే ఏడాదిలోగా దేశంలో 3 వేల ఏటీఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.