గోద్రెజ్ ప్రాపర్టీస్ కీలక నిర్ణయం
డీబీ రియాల్టిలో పది శాతం వాటా తీసుకోనున్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ వెల్లడించింది. దీని కోసం రూ. 400 కోట్లు వెచ్చిచనుంది. స్లమ్ ప్రాంతాల రీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం రెండు కంపెనీలు కలిసి రూ. 600 కోట్ల వెంచర్‌ను నెలకొల్పుతాయి. ఇందులో రెండింటికి సమాన వాటా ఉంటుంది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ మొత్తం రూ. 700 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డీబీ రియాల్టిలో పెట్టుబడులకు తమ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ వెల్లడించారు. ఇవాళ గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్ ఏకంగా 6.59 శాతం నష్టంతో ముగిసింది.