ఫ్యూచర్ గ్రూప్‌తో డీల్‌కు రిలయన్స్ టాటా
దాదాపు 20 నెలల తరవాత ఫ్యూచర్ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి రిలయన్స్ రీటైల్ తప్పుకుంది. ఫ్యూచర్, రిలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి సెక్యూర్డ్ రుణదాతలు ముఖ్యంగా బ్యాంకులు తిరస్కరించడంతో రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. వాటాదారులతో పాటు అన్సెక్యూర్డ్ రుణదాతలు రిలయన్స్, ఫ్యూచర్ మధ్య కుదిరిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేశాయి. అయితే ఎన్సీఎల్టీ నిబంధనల ప్రకారం డీల్‌కు సెక్యూర్డ్ రుణదాతల్లో 75 శాతం ఆమోదం పొందాల్సి ఉంది. ఫ్యూచర్స్ రీటైల్ లిమిటెడ్‌తో పాటు ఇదే గ్రూప్‌నకు చెందిన ఇతర లిస్టెడ్ కంపెనీలను టేకోవర్ చేసేందుకు రూ. 24,173 కోట్ల డీల్‌ను 2020 ఆగస్టులో ప్రకటించారు. ఇదే వ్యవహారంపై మరోవైపు అమెజాన్ కూడా ఈ డీల్‌ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ డీల్‌ను వ్యతిరేకించిన సెక్యూర్డ్ రుణదాతల్లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి.