For Money

Business News

యాప్‌ను అప్‌డేట్‌ చేయలేదా… పోయినట్లే

చాలా కాలం నుంచి అప్‌డేట్‌ అవని యాప్‌లను యాప్‌స్టోర్‌ నుంచి తొలగించాలని యాపిల్‌ కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంటే… అవి డౌన్‌లోడ్‌ చేసుకున్న డివైజ్‌లలో ఉంటాయి. అంటే కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి యాప్‌స్టోర్‌లో ఉండవన్న మాట. యాప్‌ను అప్‌డేట్‌ చేయడానికి యాప్‌ డెవలపర్స్‌కు 30 రోజుల సమయం యాపిల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు యాప్‌ డెవలర్స్‌కు ఈమెయిల్ పంపింది. 30 రోజుల్లోగా యాప్‌ను అప్‌డేట్‌ చేయకుంటే తొలగిస్తామని పేర్కొంది. దీనితో అనేక కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.