బెంగళూరు సమీపంలో భారీ ప్లాంట్
తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్‌కాన్ బెంగళూరు సమీపంలో భారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే విస్తరించాలని భావించిన ఈ కంపెనీ ఇపుడు బెంగళూరు నగర శివార్లలో 300 ఎకరాలను కొనుగోలు చేసింది. ఎయిర్‌పోర్టు ఉన్న దేవనహళ్ళికి సమీపంలో ఈ విస్తరణ చేపట్టనుంది. ప్రస్తుతం యాపిల్ కంపెనీకి ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్న ఈ కంపెనీ చైనా నుంచి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్‌కు తరలించే పనిలో ఉంది. 120 లక్షల చదరపు మీటర్ల భూమిని కొనుగోలు చేసినట్లు ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ హాన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ పేర్కొంది. ఈ స్థలం కోసం రూ. 300 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది.