For Money

Business News

18300పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి లాభాలో ప్రారంభమైంది. ఆరంభంలోనే 18318ని తాకిన నిఫ్టి ఇపుడు 18301 వద్ద ట్రేడవుతోంది. అన్ని ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ నిఫ్టికి అండగా నిలిచింది. నిఫ్టి 0.6 శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదానీ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగుతోంది. మరోవైపు బజాజ్ ఫిన్‌ సర్వ్‌ ఇవాళ కూడా లాభాలతో ట్రేడవుతోంది. రెండు శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. యూపీఎల్‌ రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌ రెండు శాతం లాభంతో టాప్‌లో ఉంది. అదానీ ట్రాన్స్‌ మిషన్‌ మరో 5 శాతం క్షీణించింది.