ఈ షేర్లు డే ట్రేడింగ్ కోసం
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఈ నాలుగు షేర్లను పరిశీలించండి. స్టాప్‌లాస్ పాటించడం మాత్రం మర్చిపోవద్దు.
కమిన్స్ ఇండియా
కొనాల్సిన ధర : రూ. 1200
టార్గెట్ : రూ. 1400
స్టాప్‌లాస్ : రూ.1100
గత కొన్ని రోజులుగా ఈ షేర్ చాలా పటిష్ఠంగా ఉంది. ఈమధ్యే రూ. 1150పై బ్రేకౌట్ నిర్ధారణ అయింది. పైగా ఇది ఆ షేర్ ఆల్ టైమ్ హై. ధరతో వ్యాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి బ్రేకౌట్ ఖాయంగా కన్పిస్తోంది.
Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers
విప్రో
కొనాల్సిన ధర : రూ. 410
టార్గెట్ : రూ. 450
స్టాప్‌లాస్ : రూ.390
చాలా వరకు ఐటీ షేర్లు కోలుకుంటున్నాయి. విప్రో కూడా అదే బాటలో పయనించవచ్చు. డైలీ, వీక్లీల చార్ట్‌లను చూస్తే ఈ షేర్ RSI డైవర్జన్స్ పాజటివ్‌గా ఉంది. ఈ షేర్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది.
Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers
రెయిన్ ఇండస్ట్రీస్
కొనాల్సిన ధర : రూ. 162
టార్గెట్ : రూ. 180
స్టాప్‌లాస్ : రూ.155
డైలీ చార్ట్‌లలో ఈ షేర్ గత గరిష్ఠ స్థాయిని దాటింది. ఈ షేర్లో బుల్లిష్‌నెస్ పెరుగుతోంది. RSI ఇండికేటర్ కూడా పాజిటివ్ మూమంటమ్ను సూచిస్తోంది. స్వల్ప కాలంలో ఈ షేర్ రూ.180ని తాకనుంది. దిగువ స్థాయిలో ఈ షేర్‌కు రూ. 155 వద్ద మద్దతు ఉంది.
Analyst: Rupak De, LKP Securities
బాలాజి అమిన్స్
కొనాల్సిన ధర : రూ. 3319
టార్గెట్ : రూ. 3550
స్టాప్‌లాస్ : రూ.3250
డైలీ చార్ట్‌లలో ఈ షేర్ ఇటీవల కన్సాలిడేషన్‌ను దాటి పైకి కదలింది. అంటు ఈ షేర్ బుల్లిష్‌నెస్ పెరుగుతోంది. RSI కూడా బుల్లిష్ క్రాస్వోవర్కు రెడీగా ఉంది. స్వల్పకాలీన ఈ షేర్ రూ. 3550ని తాకనుంది. పడితే రూ. 3230 వద్ద మద్దతు లభించవచ్చు.
Analyst: Rupak De, LKP Securities
(Disclaimer: ఇక్కడ ఇచ్చిన రెకమెండేషన్లు, సలహా, సూచనలు, అభిప్రాయలు ఆయా రంగాల్లో నిపుణులవి. ఇవి www.formoney.in అభిప్రాయాలు కావాల్సిన అవసరం లేదు)