For Money

Business News

పెరగనున్న ధరలు

ఆయిల్‌, ఎల్‌పీజీ ధరల ప్రభావం క్రమంగా నిత్యావసర వస్తువులపై కన్పిస్తోంది. ఇప్పటి వరకు వేచి చూసే ధోరణి అవలంబించిన కంపెనీలు ఇపుడు ధరలు పెంచక తప్పదని భావిస్తున్నాయి. ముడి సరుకుల ధరలు అనూహ్యంగా పెరగడంతో ధరలు పెంచాల్సిందేనని, లేదంటే తమ లాభదాయకత దెబ్బతింటుందని FMCG కంపెనీలు అంటున్నాయి.
మూడు నుంచి నాలుగు శాతం మేర ధరల పెంపు ఉంటుందని భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్లాస్టిక్‌, పామాయిల్‌ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయి. మరోవైపు వేసవి నేపథ్యంలో పలు ఎయిర్‌ కండీషన్డ్‌ కంపెనీలు కూడా తమ ఉత్పత్తలు ధరలను15 శాతం దాకా పెంచాయి. దైకిన్‌తో పాటు బ్లూస్టార్‌ వంటి ఏసీ కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచాయి. క్రూడ్‌ ధరలు భారీగా పెరగుతుందన్న హిందుస్థాన్‌ లీవర్‌ కూడా త్వరలోనే ధరలను పెంచే ఛాన్స్‌ ఉంది. టైర్‌, పెయింట్స్‌కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశముంది.