బాబోయ్… ఇదేం ద్రవ్యలోటు
ఆదాయం, ఖర్చు, లోటు గురించి రాష్ట్రాలకు పదే పదే హెచ్చరికలు చేసే కేంద్ర ప్రభుత్వం తన వరకు వచ్చే సరికి బోర్లా పడింది. హద్దేలేని ఖర్చుతో ద్రవ్యలోటు హద్దులు దాటింది. కొద్దిసేపటి క్రితం వచ్చిన జీడీపీ వృద్ధి రేటు ఆందోళన కల్గిస్తే… ద్రవ్యలోటు కంగారె పెట్టిస్తోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో అంటే ఏడు నెలల్లో కేంద్ర ద్రవ్యలోటు రూ. 7.58 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు రూ. 5.47 లక్షల కోట్లు.దీనికి ప్రధాన కారణంగా ఆదాయం మించి కేంద్రం ఖర్చు చేయడమే. ఈ ఏడు నెలల్లో కేంద్రం నికర పన్నుల ద్వారా వచ్చిన వసూళ్ళు రూ. 11.71 లక్షల కోట్లు కాగా, మొత్తం వ్యయం రూ. 21.44 లక్షల కోట్లు అని కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ఈ ఏడాది మొత్తానికి కేంద్రం ద్యవ్యలోటు రూ. 16.61 లక్షల కోట్లు ఉంటుదని అంచనా వేసింది. అందులో ఏడు నెలల్లోనే 45.6 శాతానికి చేరింది. చిత్రమేమిటంటే జీడీపీ వృద్ధి రేటు బాగుంటుందని అంచనాతో ద్రవ్యలోటు అంచనా వేశారు.