For Money

Business News

ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ IPO 29 నుంచి

ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ ఎల్లుండి ప్రారంభం కానుంది. నవంబరు 2న ముగుస్తుంది. రూ. 10 ముఖవిలువ గల ఈ షేర్‌ ధరల శ్రేణిగా రూ.560- 577ను కంపెనీ నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. మనదేశంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదుకానున్న మొదటి పేమెంట్‌ బ్యాంక్‌ ఇదే. ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేస్తారు. ఇక ఇప్పటికే వాటా ఉన్న ఇన్వెస్టర్లు 1.5 కోట్ల విలువైన షేర్లను ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా అమ్ముకుంటారు. కనిష్ఠంగా 25 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ ధరను పరిగణనలోకి తీసుకుంటే కనీస దరఖాస్తు సొమ్ము రూ. 14,425. గరిష్ఠంగా 13 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా మొత్తాన్ని బ్యాంక్‌ తన మూలధనం పెంచుకునేందుకు ఉపయోగిస్తుంది.