For Money

Business News

కొత్తగా జియో, బీపీ పెట్రోలు బంక్‌లు

రిలయన్స్‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌ కంపెనీ కొత్తగా జియో- బీపీ బ్రాండుపై పెట్రోల్‌ బంకులును తెరుస్తోంది. మొదటి పెట్రోలు బంక్‌ను నవీ ముంబయిలో ప్రారంభించింది. ఇప్పటి వరకు రిలయన్స్‌ చేతిలో ఉన్న ఈ బంకులను రిలయన్స్‌ బీపీ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. విద్యుత్‌ వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయం సహా పలు రకాల ఇంధనాలను కొత్త షాప్‌లో విక్రయిస్తారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన 1400 పెట్రోలు పంపులు, 31 విమాన ఇంధన కేంద్రాల్లో 49 శాతం వాటాని 2019లో బీపీ 1 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.7500 కోట్లు) కొనుగోలు చేసింది. దీంతో రిలయన్స్‌కు చెందిన పెట్రోల్‌ బంక్‌లన్నీ సంయుక్త సంస్థకు బదిలీ అయ్యాయి. 2025 కల్లా ఈ సంస్థ తన పెట్రోల్‌ బంక్‌ల సంఖ్యను 5,500కి పెంచుకునే యోచనలో ఉంది. 1,400 పాత్‌ బంక్‌ల పేరును జియో-బీపీగా మార్చారు.