For Money

Business News

బైజూస్‌కు ఈడీ షాక్‌

ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రూ. 9,362.35 కోట్లకు సంబంధించి కంపెనీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ నోటీసులో పేర్కొంది. ఈ మేరకు ఈడీ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. బైజూస్‌ మాతృసంస్థ థింక్‌ అండ్‌ టర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు ఆ కంపెనీ ప్రమోటర్‌ అయిన బైజు రవీంద్రన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ ఆఫీసులపై ఈడీ దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో
విదేశాల నుంచి సమీకరించిన పెట్టుబడులతో పాటు విదేశీ కంపెనీ పెట్టబడులపై ఆరా తీసింది. విచారణ సమయంలో బైజూ రవీంద్రన్‌తో పాటు కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ను కూడా విచారించి.. వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రూ. 9,362 కోట్ల మేరకు ఫెమా నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్లు షోకాజ్‌ నోటీసులో ఈడీ పేర్కొంది. కంపెనీ చేసుకున్న దిగుమతులకుగాను విదేశాల్లో చేసిన పలు అడ్వాన్స్‌ పేమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించడంలో కంపెనీ విఫలమైందని ఈడీ పేర్కొంది. అలాగే కంపెనీ చేసిన ఎగుమతులకు సంబంధించిన నిధులను కంపెనీ తీసుకురాలేని ఈడీ ఆరోపించింది. విదేశాల నుంచి తెచ్చిన పెట్టుబడులకు సంబంధించిన పూర్తి పత్రాలను కూడా కంపెనీ సమర్పించడంలో విఫలమైందని వెల్లడించింది.