For Money

Business News

అన్నీ నష్టాల్లో… బులియన్‌ తప్ప

ఫెడ్‌ నిర్ణయం తరవాత వాల్‌స్ట్రీట్‌లో వచ్చిన ర్యాలీ.. రెండో రోజే తస్సు్మంది. నిన్న స్థిరంగా ముగిసిన సూచీలు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పలు కార్పొరేట్‌ కంపెనీలు భవిష్యత్‌ అంచనాల్లో కోత విధించడంతో పాటు చైనా వృద్ధి రేటుపై అనుమానాలు పెరగడంతో ఈక్విటీ మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం మేరకు నాస్‌డాక్‌ 0.45 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.30 శాతం, డౌజోన్స్‌ 0.40 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. పదేళ్ళ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ ఒకటిన్నర శాతం తగ్గినా.. ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి రావడం విశేషం. మరోవైపు డాలర్‌ మరింత క్షీణించి 104 ప్రాంతంలో ట్రేడవుతోంది. చైనా వృద్ధిపై అనుమానాలు, నిన్న అమెరికా క్రూడ్‌ నిల్వలు అనూహ్యంగా పెరగడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 78 డాలర్ల దిగువకు వచ్చేసింది. కేవలం బులియన్‌ మార్కెట్‌ ఒక్కటే లాభాల్లో ఉంది. బంగారం ఒక శాతం, వెండి ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం ధర 1985 డాలర్ల ఉంది. డాలర్‌ గనుక ఇంకా క్షీణిస్తే… బంగారం 2000 డాలర్ల స్థాయిని ఈజీగా దాటే అవకాశముంది.