For Money

Business News

టాటా టెక్‌ ఐపీఓ పూర్తి వివరాలు

టాటా టెక్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూలో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రైస్‌ బాండ్‌ను కంపెనీ ఇవాళ ప్రకటించింది. ధరల శ్రేణి రూ. 475-రూ.500గా నిర్ణయించింది. కనీస పెట్టుబడి తెలిసిందే. రూ. 15000. అంటే గరిష్ఠ ధరతో 30 షేర్లకు దరఖాస్తు చేఉసుకోవాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధరన ఈ ఆఫర్‌ ద్వారా రూ.3,042 కోట్లను టాటా టెక్‌ సమీకరించనుంది. పేరుకు ఇది ఐపీఓ కాని… నిజానికి ఇది ఆఫర్ ఫర్‌ సేల్‌. అంటే కంపెనీలోని కొందరు ప్రమోటర్లు తమ వద్ద ఉన్న వాటాలోకొంత భాగాన్ని ఈ ఆఫర్‌ ద్వారా విక్రయిస్తున్నారు. 2004లో వచ్చిన టీసీఎస్‌ తరవాత టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న తొలి పబ్లిక్‌ ఇష్యూ ఇదే.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
ఐపీఓ ప్రారంభ తేదీ : నవంబరు 22
ఐపీఓ ముగింపు తేదీ : నవంబర్‌ 24
షేరు ముఖ విలువ : రూ.2
ధరల శ్రేణి : రూ.475- రూ. 500
కనీసం ఒక లాట్‌కు ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది.
ఒక లాట్‌లో 30 షేర్లు ఉంటాయి
కనీస పెట్టుబడి: రూ.15,000 (గరిష్ఠ ధర వద్ద)
షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
లిస్టింగ్‌ తేదీ : డిసెంబరు 5