For Money

Business News

పొరపాటున కస్టమర్ల ఖాతాలో రూ.820 కోట్లు జమ

యూకో బ్యాంక్‌ ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.820 కోట్లు పొరపాటున జమ అయ్యాయి. IMPSలో సాంకేతిక లోపం కారణంగా ఈ మొత్తం జమ అయినట్లు తెలుస్తోంది. యూకో బ్యాంక్‌లో జరిగిన ఈ పొరపాటు నవంబర్‌ 15న బుధవారం వెలుగులోకి వచ్చినట్లు స్టాక్‌ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. వేరే బ్యాంకుల కస్టమర్లు చేసిన చెల్లింపులు తమ కస్టమర్ల ఖాతాల్లో జమ అయినట్లు యూకో బ్యాంక్‌ వెల్లడించింది. అయితే వాస్తవంగా ఈ సొమ్ము బదిలీ కాలేదని పేర్కొంది. నవంబర్‌ 10 నుంచి 13వ తేదీల మధ్య ఐఎంపీఎస్‌లో సాంకేతిక లోపం వల్ల ఇది జరిగినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. పొరపాటును గుర్తించిన వెంటనే తమ ఐఎంపీఎస్‌ ఛానెల్‌ను ఆపేసినట్లు తెలిపింది. జమ అయిన ఖాతాలను బ్లాక్‌లో పెట్టింది. జమ అయిన రూ. 820 కోట్ల నుంచి రూ. 649 కోట్లు రికవరీ చేశామని… మరో రూ. 171 కోట్లు మొత్తం వెనక్కి రావాల్సి ఉందని తెలిపింది. ఈ పొరపాటు సాంకేతికమా లేదా హ్యాకింగ్‌ జరిగిందా అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.