వొడోఫోన్ మాకొద్దు
టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. వొడాఫోన్ టేకోవర్‌పై పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టేకోవర్ చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీలో కేంద్రానికి 33.1 శాతం వాటా ఉంది. రూ.16,133 కోట్ల ఏజీఆర్ బకాయిలను కేంద్రం ఈక్విటీ మార్చుకోవడంతో ఈ వాటా దక్కింది. కేంద్రం ఇపుడు అతి పెద్ద వాటాదారు కాగా, మిగిలిన వాటాలో బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూప్, భారత్‌కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు ఉంది.