ఉద్ధవ్ బావమరిది ఆస్తులు ఈడీ జప్తు
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పోరు పతాక స్థాయికి చేరుతోంది. భారతీయ జనతా పార్టీ ఇపుడు పాకిస్తాన్ జనతా పార్టీగా మారిపోయిందని సీఎం ఉద్ధవ్ థాకరే విమర్శలు చేసిన తరవాత ఆయన బావమరిది శ్రీధర్ పతాంకర్‌కు చెందిన కంపెనీల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. థానేలోని వర్తక్ నగర్‌లో నిర్మించిన నీలాంబరి ప్రాజెక్టులోని 11 ఫ్లాట్లను ఈడీ జప్తు చేసింది. పుష్పక్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన రూ. 6.45 కోట్ల ఆస్తులను తాము జప్తు చేసుకున్నట్లు ఈడీ ఇవాళ వెల్లడించింది. పుష్పక్ గ్రూప్ శ్రీధర్ పతాంకర్‌కు చెందినది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో వేట కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ తన గుజరాత్ కార్యాలయాన్ని మూసేసినట్లు ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల విమర్శించారు.