11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమౌతాయి. 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ తరవాత సమావేశాలు యధావిధిగా కొనసాగతాయి. ఇవాళే కేంద్ర ఆర్థిక మంత్రి 2021-22 ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాళ రేపు జీరో అవర్, క్వశ్చన్ అవర్స్ ఉండవు. ఈనెల 11వ తేదీ దరకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. పార్లమెంటు సభ్యులు, విజిటర్స్ కోసం కోవిడ్ వ్యాక్సిన్, టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.