మోల్నుపిరవిర్ ధర రూ.1,400
మెర్క్ అభివృద్ధి చేసిన కరోనా నివారణ మందు మోల్నుపిరవిర్‌ను ‘మోల్‌ఫ్లూ’ పేరుతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 40 క్యాప్సుల్స్ ఉండే ప్యాక్ ధర రూ. 1,400గా కంపెనీ నిర్ణయించింది. అత్యవసర సమయంలో, వ్యాధి ముదురుతున్న సమయంలో మాత్రమే ఈ ట్యాబ్లెట్లను వాడేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ట్యాబ్లెట్లను కూడా డాక్టర్ల సిఫారసు మేరకే అమ్మాల్సి ఉంటుంది. అంటే మెడికల్ షాప్‌లలో ఓవర్ ద కౌంటర్లో అమ్మడానికి వీల్లేదు. మెర్క్ నుంచి ఈ మందు తయారు చేసేందుకు మన దేశంలో 13 కంపెనీలు అనుమతి పొందాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో పాటు సన్ ఫార్మా, సిప్లా, అరబిందో, టొరెంట్ ఫార్మా, నాట్కో ఫార్మా, స్ట్రయిడ్స్ ఫార్మా, జేబీ కెమికల్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు అమ్ముతున్నాయి.