For Money

Business News

టాటా మోటార్స్‌ సెల్‌ అన్న CLSA.. టార్గెట్‌

కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో రూ. 50లకు చేరిన టాటా మోటార్స్‌… కరోనా పుణ్యమా అని రూ. 536ని తాకింది. రూ. 500 పైన ఈ షేర్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిన్న ఈ షేర్‌ రూ. 497 వద్ద ముగిసింది. ఇవాళ ప్రముఖ రీసెర్చి సంస్థ CLSA ఈ కంపెనీపై తన తాజా నివేదికను విడుదల చేసింది. ఒకదశలో ఈ షేర్‌ రూ. 484కు అంటే రెండు శాతంపైగా నష్టపోయింది. అయితే క్లోజింగ్‌లో రూ. 489 వద్ద ముగిసింది. CLSA నివేదిక ప్రకారం ఈ కంపెనీ షేర్‌ ఇక ముందుకు సాగే అవకాశాల్లేవ్‌. కంపెనీ సమీప భవిష్యత్‌ వ్యాపారాన్ని అంచనా వేసిన CLSA…ఈ షేర్‌ను సెల్‌ చేయాల్సిందిగా ఇన్వెస్టర్లకు సిఫారసు చేసింది. గతంలో ఈ కంపెనీ షేర్‌ టార్గెట్‌ రూ.450గా పేర్కొన్న ఈ సంస్థ తాజా దీని టార్గెట్‌ ధర రూ. 408గా పేర్కొంది. అంటే దాదాపు 20 శాతం పతనం సూచిస్తోందన్నమాట. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ విషయంలో జేఎల్‌ఆర్‌ వెనుకబడి ఉందని, దేశీయ ప్యాసింజర్‌ వెహికల్‌ బిజినెస్‌ విషయంలో ఈ షేర్‌ వ్యాల్యూ ఓవర్‌ వ్యాల్యూడ్‌గా పేర్కొంది. CLSA అంచనా ప్రకారం టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వ్యాపారం షేర్‌కు రూ. 150, జేఎల్‌ఆర్‌ విభాగానికి రూ. 151, దేశీయ ప్యాసింజర్‌ వాహన వ్యాపారానికి రూ. 99చొప్పున లెక్క వేసింది. దీంతో ఈ షేర్‌ ధర రూ. 408గా పేర్కొంది.చిప్‌ సమస్య తొలిగితే జేఎల్‌ఆర్‌ వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని CLSA అంటోంది. అలాగే రానున్న మూడు సంవత్సరాల్లో కంపెనీ కమర్షియల్‌ వెహికల్‌ వ్యాపారం కూడా పటిష్ఠంగా వృద్ధి చెందుతుందని CLSA అంచనా వేస్తోంది.