డౌజోన్స్ సూపర్
వాల్‌స్ట్రీట్ ఇవాళ గ్రీన్‌లో ఉంది. టెక్, ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతున్నా… ఎకనామీ, గ్రోత్ షేర్లకు మద్దతు అందింది. దీంతో డౌజోన్స్ 1.1 శాతం లాభంతో ట్రేడవుతోంది. నాస్డాక్ 0.18 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.46 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ ఇవాళ అరశాతంపైగా క్షీణించింది. అంతకుమునుపు యూరో మార్కెట్లు అర శాతం వరకు నష్టంతో ముగిశాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్‌లో మాత్రం పెద్ద మార్పు లేదు. క్రూడ్ ఆయిల్ రెండు శాతం క్షీణించడం శుభపరిణామం. డాలర్‌తో పాటు క్రూడ్ తగ్గడం వల్ల భారత్ వంటి మార్కెట్లకు శుభవార్తే. మరోవైపు బులియన్ కూడా మిశ్రమంగా ఉంది. బంగారం 0.8 శాతం పెరగ్గా, వెండి స్వల్ప నష్టంతో ఉంది. అమెరికా మార్కెట్ల ఓపెనింగ్‌తో బులియన్ భారీగా రికవర్ అయింది.