కోలుకున్న వాల్‌స్ట్రీట్
స్వల్ప లాభాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్… ట్రేడింగ్ కొనసాగే కొద్దీ బలపడింది. తాజా సమాచారం మేరకు డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 1.6 శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నాస్డాక్ కూడా ఒక శాతం లాభంతో ఉంది. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా నష్టాల నుంచి కోలుకుని ఒక శాతం దాకా లాభాలు పొందాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ ఇవాళ కూడా గ్రీన్‌లో ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 97.50 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్ సమయంలో 111 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్ స్వల్పంగా తగ్గి ఇపుడు 110 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. బులియన్లో ఒత్తిడి కన్పిస్తోంది. బంగారం, వెండి …రెండూ ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి.