For Money

Business News

ఏడాది కనిష్ఠానికి డాక్టర్‌ రెడ్డీస్‌

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రభావం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ వ్యాపారం పడనుంది. దీంతో ఈ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్‌ ఇవాళ కూడా 5.15 శాతం నష్టంతో రూ. 3854 వద్ద ముగిసింది. ఆరంభంలో ఈ షేర్‌ రూ. 3822ను కూడా తాకింది. ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి. గత ఏడాది జులై 7వ తేదీన ఈ షేర్‌ రూ. 5,614.60లను తాకింది. కాని అప్పటి ఫార్మా రంగంలోనే కరెన్షన్‌ వచ్చింది. దీంతో ఈ షేర్‌ కూడా క్షీణిస్తూ వచ్చింది. కాని ఇపుడు జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ బిజినెస్‌పై పడనున్నాయి. కంపెనీ టర్నోవరల్‌ 8 శాతం రష్యా నుంచి 2 శాతం ఉక్రెయిన్‌ వస్తోంది. దీనికి తోడు రష్యా రూబుల్‌ విలువ భారీగా పడిపోవడం వల్ల రెడ్డీస్‌ ల్యాబ్‌ టర్నోవర్‌పై దీని ప్రభావం 10 వరకు ఉండే అవకాశముంది. అయితే నొమురా మాత్రం ఈ షేర్‌ను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తోంది. ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 5552గా పేర్కొంది. ఇతర దేశాల వ్యాపారాలలో బాగా రాణిస్తుందని నొమురా అంటోంది.