దుమ్మురేపుతున్న డాలర్
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ దూసుకు పోతోంది. మొన్నటి దాకా డాలర్ ఇండెక్స్ 94 దాటడం చాలా కష్టంగా ఉండేది. ఇవాళ 0.33 శాతం పెరిగి 95.72 వద్ద ట్రేడవుతోంది. త్వరలోనే 96ని తాకే అవకాశముంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్, బులియన్ తగ్గినా మన మార్కెట్ పెద్ద మార్పు లేదు. నిజానికి వెండి గ్రీన్‌లో ఉంది. దీనికి కారణం డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడమే. ఇక వాల్‌స్ట్రీట్‌లో మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. మూడూ 0.4 శాతంపైగానే ట్రేడవుతున్నాయి. లక్ష కోట్ల ట్రిలియన్ డాలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడానికి మార్కెట్ సానుకూలంగా స్పందిస్తోంది.