For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌ 0.7 శాతం లాభంతో ముగిసింది. అయినా ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం.. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ దూసుకుపోవడమే. డాలర్‌ ఇండెక్స్‌ ఏ క్షణమైనా 96ని బ్రేక్‌ చేసేందుకు రెడీగా ఉంది. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ 0.4 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా నష్టాల్లో ఉన్నా నామ మాత్రంగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి కూడా ఇదే స్థాయి నష్టాలు లేదా స్థిరంగా ప్రారంభం కానుంది.