NIFTY TRADE: ఎఫ్‌ఐఐల అమ్మకాలు
గత శుక్రవారం మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగాయి. ఏకంగా రూ. 1598 కోట్ల నికర అమ్మకాలు చేశారు. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 626 కోట్ల అమ్మకాలు చేయగా, స్టాక్ ఫ్యూచర్స్‌లో కూడా రూ. 896 కోట్ల నికర అమ్మకాలు చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్‌లో మాత్రం రూ. 5358 కోట్ల కొనుగోళ్ళు చేశారు. సీఎన్‌బీసీ వీరేందర్ కుమార్ అంచనా ప్రకారం నిఫ్టి 18283 లేదా 18334 వద్ద ప్రతిఘటన రావొచ్చు. పడితే 18166 వద్ద లేదా 18109 వద్ద మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 18000 స్థాయికి నిర్ణయాత్మకంగా నిఫ్టి బ్రేక్ చేసేంత వరకు నిఫ్టిని షార్ట్ చేయొద్దని ఆయన ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నారు. బ్యాంక్ నిఫ్టి, ఇతర డేటా కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=2IDCtXWa6l4