ఫలితాలు ప్చ్… షేర్ 8% డౌన్
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దివీస్ లేబొరేటరీస్ కంపెనీ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా అంచనాలకు చాలా దూరంగా ఫలితాలు ఉండటంతో షేర్ ఏకంగా 10 శాతం దాకా పడింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 579 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్ అంచనా వేయగా కంపెనీ రూ. 493 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 19 శాతం క్షీణించింది. కంపెనీ ఆదాయం కూడా 3.6 శాతం తగ్గి రూ. 2007 కోట్ల నుంచి రూ. 1935 కోట్లకు తగ్గింది. కంపెనీ ఆదాయం పెద్దగా క్షీణించకున్నా.. నికర ఆదాయం బాగా క్షీణించింది. పైగా గత ఏడాది ఇదే కాలంఓ కరెన్సీలో వచ్చిన మార్పుల కారణంగా రూ.7 కోట్ల నష్టం రాగా, ఈసారి రూ.30 కోట్ల లాభం వచ్చింది. లేకుంటే కంపెనీ నికర లాభం ఇంకా ఎక్కువగా ఉండేది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ బాగా క్షీణించిడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. స్టాండ్ అలోన్ ఫలితాలను చూస్తే కంపెనీ నికర లాభం రూ. 606 కోట్ల నుంచి రూ. 487 కోట్లకు పడిపోయింది. గత ఏడాది 41 శాతం ఉన్న ప్రాఫిట్ మార్జిన్ ఈసారి 38.1 శాతం ఉండొచ్చిన మార్కెట్ అంచనా వేసింది. కాని కంపెనీ ఫలితాలను చూస్తే మార్జిన్ 33.5 శాతానికి పడిపోయింది. పూర్తి ఏడాది మార్జిన్లో పెద్దగా మార్పు ఉండదని కంపెనీ ఇది వరకే ప్రకటించిందని.. మరి ద్వితీయార్ధంలో కంపెనీ పనితీరు ఎలా ఉంటుందో చూడాలి.