కనిపించని మనీష్ సిసోడియా పేరు
ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో మాదిరి ఈడీ చార్జిషీటులో కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు లేదు. కేవలం సమీర్ మహేంద్రుపై మాత్రమే చార్జిషీటు దాఖలు చేశారు. త్వరలోనే ఇతరులపై కూడా చార్జిషీటు దాఖలు చేస్తామని రౌజ్ అవెన్యూ కోర్టుకు ఈడీ పేర్కొంది. చార్జిషీటులను సాఫ్ట్ కాపీలో అంటే సీడీలో కోర్టుకు సమర్పించింది. చార్జిషీటు దాదాపు 3000 కాపీలు ఉండే అవకావముందని తెలుస్తోంది. దీంతో వీటిని పరిశీలించి పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టుకు కొంత సమయం పట్టే అవకాశముంది. చార్జిషీటు దాఖలు చేసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ‘ఈడీ చార్జీషీటులో కూడా మనీష్ పేరు లేదు. విద్యకు సంబంధించి మనీష్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించినందుకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలికదా? బాగా పనిచేసేవారిని జైల్లో పడేస్తే… దేశం ముందుకు సాగుతుందా?’ అని అరవింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు.