ఈడీ రాసిన లేఖలో ఏముంది?
మద్యం స్కామ్ విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెల 17వ తేదీన జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ అనే కంపెనీకి సంబంధించిన వివరాలు కావాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్కు లేఖ రాసింది. మనీ లాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 54 కింద మూడు కీలక అంశాలపై వివరాలను కోరింది. ఈ కంపెనీ నెలకొల్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ నిర్వహించిన అన్ని కంపెనీల వివరాలు, ఆ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను సమర్పించాలని కోరింది. అలాగే విమానాలను నిర్వహించిన మేనేజర్ల వివరాలను కూడా ఇవ్వాలని కోరింది. ఒకే ఒక్క రోజులో అంటే అక్టోబర్ 18కల్లా ఈ వివరాలన్నీ సమర్పించాలని లేఖలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీని ఈడీ కోరడం విశేషం. విమానాల్లో తరలించిన వస్తువులు.. ఇతర వివరాలను తెలుసుకునేందుకే మేనేజర్ల వివరాలను కోరినట్లు తెలుస్తోంది.