ఐడీబీఐ బ్యాంక్‌పై డీబీఎస్ బ్యాంక్ కన్ను?
ఐడీబీఐ బ్యాంకులో వాటా తీసుకునేందుకు డీబీఎస్ బ్యాంక్ ఆసక్తితో ఉన్నట్లు ఈటీ నౌ ఛానల్ పేర్కొంది. ఈ బ్యాంకును ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహిస్తోంది. వచ్చే నెలలో ఆసక్తిగల పార్టీల నుంచి బిడ్ ఆహ్వానించనుంది. ఈ బ్యాంకును టేకోవర్ చేసేందుక ఆసక్తితో ఉన్న డీబీఎస్ బ్యాంక్ ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపినట్లు ఈటీ ఛానల్ పేర్కొంది. తొలి విడత 25 శాతం లేదా 49 శాతం వాటాను ప్రభుత్వం ఆఫర్ చేసే అవకాశముంది. బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వానికి దాదాపు 95 శాతం వాటా ఉంది. బిడ్ల కోసం ప్రభుత్వం Expression of Interest డాక్యుమెంట్లు విడుదల చేసిన తరవాత డీబీఎస్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ఈటీ నౌ ఛానల్ పేర్కొంది.