క్రూడ్ ఆయిల్ పరుగులు
రాత్రి వెల్లడైన అమెరికా క్రూడ్ డేటాతో ఆయిల్‌కు మరింత ఊతం లభించింది. నిన్న వారాంతపు క్రూడ్ నిల్వలు క్షీణించినట్లు అమెరికా తెలిపింది. అంటే డిమాండ్ జోరుగా ఉందన్నమాట. గత వారం 90 డాలర్లకు చేరిన ఆయిల్‌లో ఒక మోస్తరు అమ్మకాల ఒత్తిడి రావడంతో తగ్గింది. ఇపుడు మళ్ళీ పుంజకుంది. తాజా సమాచారం మేరకు ఆసియా దేశాలు కొనుగోలు చేసే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 89.55 డాలర్లను దాటింది. WTI క్రూడ్ కూడా 88.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తిని పెంచకపోవడం… క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరగడంతో… ధరలు తగ్గడం లేదు. మరోవైపు ఒపెక్ దేశాలు ఇవాళ భేటీ కానున్నాయి. అయితే క్రూడ్ ఉత్పత్తిని పెంచకపోవచ్చని… కేవలం ప్రస్తుత పరిస్థితిని మాత్రమే ఇవాళ్టి భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది.