For Money

Business News

దుమ్ము రేపిన గూగుల్‌… 89% పెరిగిన లాభం

2021లో గూగుల్‌ (ఆల్ఫాబెట్‌) రికార్డు స్థాయి టర్నోవర్‌, లాభాలు గడించింది. కంపెనీ అమ్మకాలు 2021తో పోలిస్తే 41 శాతం పెరిగి 25,800 కోట్ల డాలర్లకు చేరగా, నికర లాభం 89 శాతం పెరిగి 7600 కోట్ల డాలర్లకు చేరింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ రూ. 2,060 కోట్ల నికర లాభం ఆర్జించింది. కరోనా కారణంగా 2020లో గూగుల్‌ అమ్మకాలు కేవలం 13శాతం పెరిగాయి. 2021లో అడ్వర్టయిజ్‌మెంట్స్‌ ఆదాయం భారీగా పెరిగింది. గూగుల్‌ కంపెనీకి ప్రకటనలే ప్రధాన ఆదాయ వనరు. కంపెనీ ఆదాయంలో 81 శాతం యూట్యూబ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వేసే యాడ్స్‌తోనే వస్తాయి. అమెజాన్‌, టిక్‌టాక్‌ల ఆదాయం కూడా పెరుగుతున్నా.. గూగుల్‌ ఆదాయానికి వచ్చిన ఢోకా లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌… బ్లాకచైన్‌ను ఉపయోగించే క్లయింట్లను క్లౌడ్‌ ద్వారా సాయం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ షాపిఫైను గూగుల్‌ క్లౌడ్‌ నిర్వహిస్తోంది. ఈ విభాగం త్రైమాసిక ఆదాయం 45 శాతం పెరిగి 550 కోట్లకు చేరిందని ఆల్ఫాబెట్‌ పేర్కొంది. స్టాక్‌ మార్కెట్‌ ముగిసిన తరవాత ఫలితాలను కంపెనీ ప్రకటించింది. మార్కెట్‌ సమయంలో 1.5 శాతం పెరిగిన షేర్‌… ముగిసిన తరవాత 8 శాతం లాభంతో ట్రేడవుతోంది. షేర్‌ను విభజించాలని కూడా కంపెనీ నిర్ణయించింది. ఒక షేరును 20 షేర్లుగా గూగుల్‌ విభజించనుంది.