For Money

Business News

మోడీ అసలు విలన్‌… ఆయిల్‌ @89

పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంక్షోభం. అధిక ధరలతో జనం ఆందోళన చేశారు. ధరలు తగ్గించిన ప్రభుత్వం.. తరవాత పెంచుదామంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో దాదాపు రెండు నెలలకు పైగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉంచారు. కాని అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ యెమన్‌ రాజధాని సనాపై సౌదీ దళాలు భీకర దాడులు చేశాయి. గల్ఫ్‌లో ఏర్పడిన తాజా సంక్షోభం పరోక్షంగా ఆదేశాలకే ఉపయోగపడుతోంది. కారణాలు ఏదైతేనేం ఇవాళ బ్యారెల్‌ చమురు ధర 89 డాలర్లను తాకింది. పైగా నిన్న అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ 0.5 శాతంపైగా పెరిగింది. డాలర్‌తోపాటు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయంటే… దిగుమతి కోసం మన భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. తాజా పరిస్థితితో ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీల ఆర్థిక పరిస్థితి డైలమాలో పడింది. చూస్తుంటే కనీసం మార్చి 10 వరకు చమురు ధరలు పెంచే పరిస్థితి లేదు. గల్ఫ్‌లో పరిస్థితి చల్లబడితే క్రూడ్‌ కాస్త తగ్గుతుందేమోగాని… భారీ తగ్గే ప్రసక్తేలేదు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా ప్రకారం సెప్టెంబర్‌కల్లా క్రూడ్‌ ఆయిల్‌ ధర 100 డాలర్లకు చేరనుంది.