క్రూడ్ @93.50 డాలర్లు
మధ్య అమెరికా, ఈశాన్య అమెరికాలో శీతాకాల తుఫాను విరుచుకు పడటంతో… అనేక నగరాల్లో వేలాది గృహాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అనేక వ్యాపార సంస్థలకు విద్యుత్ లేకుండా పోయింది. గత బుధవారం వచ్చిన డేటా ప్రకారం అమెరికాలో చమురు నిల్వలు తక్కువగా ఉన్నాయి. తాజా తుపానులతో పెట్రోల్, డీజిల్‌కు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో అమెరికాలో WTI చమురుతో పాటు ఆసియా మార్కెట్లలో కొనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా మూడు శాతం వరకు పెరిగింది. డాలర్ కూడా పెరగడంతో,,, బ్రెంట్ క్రూడ్ 93.45 డాలర్లకు చేరింది. ఒపెక్ దేశాలు ఇప్పట్లో సరఫరా పెంచే పరిస్థితుల్లో లేవు. దీంతో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
మన ఫ్యూచర్స్‌లో…
ఎంసీఎక్స్‌లో ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు నాలుగు శాతంపైగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌తో పాటు డాలర్ కూడా పెరగడంతో ఎంసీఎక్స్‌లో ఈనెల కాంట్రాక్స్ 4 శాతంపైగా పెరిగి రూ. 6958కి చేరింది. క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ కూడా భారీగా పెరిగాయి. ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఇవాళ 150 శాతంపైగా పెరిగి రూ. 70.50 నుంచి రూ. 198కి చేరింది. ఇపుడు రూ.170 వద్ద ట్రేడవుతోంది.