80 డాలర్లకు చేరువలో క్రూడ్ ఆయిల్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలిపివేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ భారీగా పెరుగుతుండటంతో మన కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. పైగా డాలర్ కూడా బలంగా ఉంటోంది. రాత్రి అమెరికాలో వారాంతపు క్రూడ్ నిల్వలు ఊహించిన స్థాయికన్నా తగ్గాయి. అంటే క్రూడ్ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాత్రి క్రూడ్ ఆయిల్ దాదాపు 80 డాలర్లను తాకింది. ఉదయం 79.63 డాలర్లను తాకింది. ఏక్షణమైనా 80 డాలర్లకు తాకేలా ఉంది. ఇప్పటికే అయిదు వారాల గరిష్ఠ స్థాయిని తాకిన క్రూడ్ జనవరి నెలలో 85 డాలర్లను దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరిగితే డాలర్ మరింత బలపడే అవకాశముంది.