For Money

Business News

కుప్పకూలిన క్రూడ్‌ ఆయిల్‌

ఆగస్టు 30న బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 105 డాలర్లు ఉండేది. ఇవాళ 88.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా దేశాలు బ్రెంట్‌ క్రూడ్‌ను కొనుగోలు చేస్తాయి. అమెరికా WTI క్రూడ్‌ ఇవాళ 82.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ధనిక దేశాల్లో మాంద్యం వస్తుందన్న అంచనాలతో పాటు ఫెడ్‌ వడ్డీ రేట్లను ఈ నెలలో భారీగా పెంచుతుందన్న అంచనాలతో క్రూడ్‌లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. గత నెలలో చైనా ముడి చమురు దిగుమతులు తగ్గాయి. దీంతో క్రూడ్‌కు డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు అధికంగా ఉన్నాయి. క్రూడ్‌ భారీగా తగ్గినా.. ఇదే సమయంలో డాలర్‌ బాగా పెరగడం కాస్త కలిసి వచ్చే అంశం. సాధారణంగా డాలర్‌ పెరిగితే క్రూడ్‌ తగ్గడం, అదే డాలర్‌ పడితే.. క్రూడ్‌ పెరగడం సహజం. భారత్‌ వంటి దేశాలకు డాలర్‌తో పాటు రూపాయి కూడా స్థిరంగా ఉండటంతో క్రూడ్‌ పతనం వల్ల పూర్తి ప్రయోజనం అందదు. ఇదే సమయంలో భారత స్టాక్‌ మార్కెట్‌లోకి విదేశీ ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నిధులు తెస్తున్నందున… రూపాయిపై ఒత్తిడి అధికంగా లేదు. ఒకవైపు బ్రెంట్‌ క్రూడ్‌ ధర 20 శాతంపైగా తగ్గినా… దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను మాత్రం కొనసాగిస్తున్నారు.