కొనసాగుతున్న ఆయిల్ పతనం
రష్యా, ఉక్రెయన్ యుద్ధ నేపథ్యంలో 140 డాలర్లకు చేరిన క్రూడ్ ఆయిల్… రెండు రోజుల నుంచి భారీగా క్షీణించింది. ఇవాళ కూడా మరో అయిదు శాతంపైగా నష్టంతో బ్రెంట్ క్రూడ్ 100.7 డాలర్లకు తగ్గింది. అమెరికా మార్కెట్లో విక్రయించే WTI క్రూడ్ ధర కూడా 97.24 డాలర్లకు క్షీణించింది. చైనాలో కరోనా ఆంక్షల కారణంగా ముడి చమురు డిమాండ్ ముఖ్యంగా ఆసియా మార్కెట్లలోభారీగా తగ్గనుంది. రాత్రి భారీగా తగ్గిన క్రూడ్ ఇవాళ మళ్ళీ కోలుకోవడంతో…. మన మార్కట్ల పరిస్థితి పరవాలేదనిపిస్తోంది. క్రూడ్‌ను ముడిపదార్థంగా వాడే అనేక కంపెనీలకు ఇది శుభవార్త. వచ్చే నెల నుంచి అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తి కూడా బాగా పెరగనుంది. కాబట్టి క్రూడ్ ధరల ర్యాలీకి బ్రేక్ పడినట్లే.