For Money

Business News

130 పాయింట్ల నష్టంతో SGX నిఫ్టి

రాత్రి అమెరికా, ఇపుడు చైనా, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండటంతో మన మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మార్కెట్‌ సూచీ 5 శాతంపైగా నష్టపోయి… ఇపుడు మూడు శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్ల నష్టాలన్నీ ఇదే స్థాయిలో ఉన్నాయి. కరోనా విషయంలో చైనా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే చైనా లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల అనేక భారత కంపెనీలు ఇబ్బంది పడనున్నాయి. షెన్‌జెన్‌ నుంచి అనేక రకాల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు భారత్‌కు వస్తాయి. ముఖ్యంగా ఆటో పరిశ్రమ దెబ్బతినే అవకాశముంది. అలాగే స్టీల్‌ వంటి ఖనిజాల దిగుమతపై కూడా ప్రభావం ఉంటుంది. రెండు లేదా మూడు వారాల వరకు లాక్‌డౌన్‌ ఉంటే పరవాలేదని… అంతకు మించి లాక్‌డౌన్‌ కొనసాగితే అనేక భారత కంపెనీలు ఇబ్బంది పడే అవకాశముంది. సింగపూర్‌ నిఫ్టి 130 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన మన మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభం కానున్నాయి.