For Money

Business News

80 డాలర్లను దాటిన క్రూడ్‌

ఒమైక్రాన్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ఉండదని వార్తలు వస్తుండటంతో… క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రష్యాతో పాటు ఒపెక్‌ దేశాల కూటమి (ఒపెక్‌ ప్లస్‌) ఇవాళ సమావేశమైంది. ఫిబ్రవరి నుంచి క్రూడ్‌ ఉత్పత్తి కోటా పెంచాలా? వద్దా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఒమైక్రాన్‌ వల్ల పెద్దగా నష్టం లేకున్నా… వెంటనే డిమాండ్‌ మేరకు ఉత్పత్తి పెంచడం కూడా కొన్ని దేశాలకు కష్టంగా ఉంది. అక్టోబర్‌, నవంబర్‌ నెలలో లక్ష్యం మేరకు ఒపెక్‌ ప్లస్‌ దేశాలు క్రూడ్‌ను ఉత్పత్తి చేయలకపోయాయి. కరోనా సంక్షోభ సమయంలో క్రూడ్‌ ధర 10 డాలర్ల కన్నా తక్కువకు పడిపోవడంతో అనేక కంపెనీలు దెబ్బతిన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. దీంతో ఇపుడు ఉత్పత్తి పెంచడం కష్టంగా ఉందని ఒపెక్‌ దేశాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బ్యారెల్‌ క్రూడ్‌ ధర 80 డాలర్లను దాటి 80.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికన్‌ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్‌ ఇవాళ ఆయిల్‌ డిమాండ్‌ అంచనాను వెల్లడించనుంది. ఒకవేళ నివేదిక పాజిటివ్‌గా ఉంటే సమీప భవిష్యత్తులో డాలర్‌ 85 డాలర్లను దాటే అవకాశముంది.