For Money

Business News

టీనేజర్లకు మరో కరోనా టీకా

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తున్న కొవొవ్యాక్స్‌ కరోనా వ్యాక్సిన్‌కు ద డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది. ఈ టీకాను 12 నుంచి 17 మధ్య వయస్సులకు అత్యవసర వినియోగానికి ఆమోదం ఇచ్చారు. 18 ఏళ్ళలోపు వాళ్ళకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన నాలుగో వ్యాక్సిన్‌ ఇది. పెద్దలకు ఇదే వ్యాక్సిన్‌ వేసేందుకు DCGI ఇది వరకే ఆమోదం తెలిపింది. నొవొవాక్స్‌ నుంచి టెక్నాలజీ బదిలీ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్‌ తయారు చేస్తోంది. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ తయారు చేసిన కార్బెవ్యాక్స్‌కు కూడా DCGI ఆమోదం తెలిపింది.