మొన్న సిటీ, ఇపుడు CLSA

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా షేర్ కవరేజీని మరో అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ ప్రారంభించింది. మొన్న సిటీ బ్యాంక్ ఈ కంపెనీపై కవరేజీని ప్రారంభించగా… ఇపుడు సీఎల్‌ఎస్‌ఏ ఈ షేర్‌ను Outperform రేటింగ్ ఇస్తూ సిఫారసు చేసింది. సిటీ రెకమెండేషన్ తరవాత ఈ షేర్ మూడు శాతం పెరిగింది. ఇపుడు ఎన్ఎస్‌ఈలో రూ. 1790 వద్ద ట్రేడవుతోంది. ఇటీవలే లిస్టయిన ఈ షేర్ ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేకపోయింది. పైగా ఆటో షేర్లపై ఇటీవల ఒత్తిడి పెరగడంతో పెద్దగా డిమాండ్ రాలేదు. అయితే సిటీ సిఫారసు తరవాత ఈ షేర్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. ఇపుడు సీఎల్‌ఎస్‌ఏ ఇచ్చిన టార్గెట్ ధర రూ. 2,155. కంపెనీ వ్యూహాత్మకంగా తన విస్తరణ ప్రణాళికను అమలు చేస్తుండటంతో పాటు వ్యాపారాన్ని వృద్ధి బాటలోతీసుకెళుతుందని సీఎల్‌ఎస్‌ఏ అంటోంది. ఇలా విస్తరణ సామర్థ్యం అందుబాటులోకి రావడంతో, తాను ఉన్న సెగ్మెంట్‌లో పెద్దగా పోటీ లేకపోవడం ఈ కంపెనీకి కలిసి వచ్చే అంశాలను ఈ బ్రోకింగ్ సంస్థ అంటోంది. భిన్నమైన మోడల్స్‌ను తేవడంతో పాటు అందుబాటు ధరలోకి కొన్ని ప్యాసింజర్ వెహికల్స్ తేవడం కూడా హ్యుందాయ్‌కు ఉపకరిస్తుందని CLSA అంటోంది. కంపెనీ వాహన శ్రేణిలో యుటిలిటీ వెహికల్స్ వాటా 63 శాతం ఉండటం కూడా ఈ కంపెనీకి ప్లస్ పాయింట్. 2026కల్లా కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తస్తోందని, అలాగే తాలేగావ్ ప్లాంట్ కూడా పనిచేయడం ప్రారంభిస్తుందని ఈ సంస్థ అంటోంది. తాను మార్కెట్‌లోకి తెచ్చిన క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ఆఫర్డబుల్ వాహనంగా నిలబడుతుందని CLSA అంటోంది.