For Money

Business News

స్టీల్‌ కంపెనీలకు గడ్డు రోజులు

కేంద్ర ప్రభుత్వం శనివారం తీసుకున్న చర్యల కారణంగా దేశీయ స్టీల్‌ కంపెనీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి. స్టీల్‌ కంపెనీలు తయారు చేసే ఎనిమిది రకాల వస్తువులపై ఎగుమతి సుంకం విధించడంతో స్టీల్‌ కంపెనీలుషాక్‌ తిన్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలతో ఎగుమతి ఒప్పందాలు చేసుకున్నామని, కొత్త నిబందనలను వెంటనే అమల్లోకి తేవడం వల్ల తాము భారీగా నష్టపోతామని అంటున్నాయి. ఎగుమతి అవకాశాలు దెబ్బతినడంతో దేశీయంగానే అందరూ తమ ఉత్పత్తులను అమ్మకాల్సి వస్తోంది.అంటే పరస్పరం పోటీ పడాల్సి ఉంటుంది. దీనివల్ల దేశీయంగా స్టీల్‌ ధరలు తగ్గుతాయని కేంద్రం అంటోంది. దీనివల్ల స్టీల్‌ కంపెనీల లాభదాయకత దెబ్బతినే అవకాశముంది. దీంతో సీఎల్‌ఎస్‌ పలు స్టీల్‌ కంపెనీల రేటింగ్‌ను తగ్గించింది. స్టీల్‌ కంపెనీల భవిష్యత్‌ లాభాల డేటాను తగ్గించనున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. దీంతో టాటా స్టీల్‌, జిందాల్ స్టీల్‌, జిందాల్ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీల షేర్లను డౌన్‌ గ్రేడ్‌ చేస్తున్నట్లు CLSA పేర్కొంది. ఇప్పటి వరకు టాటా స్టీల్‌కు ఇపుడున్న రేటింగ్‌ను బై నుంచి అండర్‌పర్ఫామ్‌కు తగ్గించింది. అలాగే జిందాల్‌ స్టీల్‌ షేర్‌కు సెల్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే జేఎస్‌పీఎల్‌ షేర్‌ రేటింగ్‌ను బై నుంచి అండర్‌ ఫర్ఫామ్‌కు తగ్గించింది. దేశీయంగా స్టీల్‌ధరలు తగ్గుతాయని CLSA అంచనా వేసింది. బొగ్గు, ఇనుప ఖనిజం ధరలు తగ్గినా.. స్టీల్‌ కంపెనీలకు పెద్దగా ప్రయోజనం ఉండదని ఈ బ్రోకింగ్ విశ్లేషణ సంస్థ పేర్కొంది.