మదర్సన్ సుమీ కొనొచ్చు…CLSA
మదర్శన్ సుమి షేర్‌కు రీసెర్చి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ Outperforming రేటింగ్ ఇచ్చింది. ఈ షేర్ రూ. 203లకు చేరుతుందని టార్గెట్‌గా పేర్కొంది. ఇవాళ ఉదయం 5 శాతందాకా పెరిగిన ఈషేర్ తరవాత 168.10 వద్ద 2 శాతంపైగా నష్టంతో ముగిసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మార్కెట్ అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. అంతర్జాతీయంగా వెహికల్ డిమాండ్ బాగుంటుందని… 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కోలుకుంటుందని పేర్కొంది. అలాగే నొమురా కూడా కొనుగోలు చేయమని సలహా ఇచ్చింది. చిప్ కొరత సమస్య ఇంకొంత కాలం ఉండొచ్చని పేర్కొంది. అంచనాలను మిచంఇ
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 16,117 కోట్ల ఆదాయంపై రూ. 245 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 6 శాతం పెరగ్గా, నికర లాభం 69 శాతం పెరిగింది. కంపెనీ ఫలితాలు మార్కెట్ అంచనాలకు మించి ఉన్నాయి.