సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్ రూ. 2025
దాదాపు రెండేళ్ళుగా స్తబ్దుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. గత త్రైమాసికంలో బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉన్నా… షేర్ ధరలు పెరుగుదల అంతంత మాత్రమే ఉంది. గత నెల చివరివారం నుంచి ఈ షేర్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఇటీవల రూ. 1407కు పడిన బ్యాంక్ షేర్ కేవలం వారం రోజుల్లోనే రూ. 1507కు చేరింది. తాజాగా రీసెర్చి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఈ బ్యాంక్ రేటింగ్‌ను పెంచింది. ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఇన్వెస్టర్లను సిఫారసు చేస్తోంది. ఈ షేర్ టార్గెట్ రూ., 2025గా పేర్కొంది. బ్యాంక్ పనితీరులో అద్భుత ప్రగతి కన్పిస్తోందని, నికర వడ్డీ ఆదాయం (Net Interet Income) ఈ త్రైమాసికంలో ఎలా ఉందో చూడాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక త్రైమాసికం నుంచి మరో త్రైమాసికానికి బ్యాంక్ 8.4 శాతం వృద్ధి రేటు చూపించింది. అలాగే రీటైర్ రుణాల వృద్ధి రేటు కూడా అంచనాల మేరకు 5 శాతం ఉందని CLSA పేర్కొంది. కాసా (CASA) కూడా పది శాతం చొప్పున పెరుగుతూ పటిష్ఠంగా ఉందని తెలిపింది. ఈ కారణాల రీత్యా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సిఫారసు చేసింది.