For Money

Business News

Closing: 100 పాయింట్ల నష్టంతో నిఫ్టి

టెక్నికల్స్‌ పరంగా మార్కెట్‌ ఇవాళ సాగింది. అధికస్థాయిలో మార్కెట్‌కు మద్దతు అందలేదు. ఆరంభంలో నష్టాల్లోకి జారుకున్నా వెంటనే కోలుకుని…మిడ్‌ సెషన్‌ వరకు స్థిరంగా కొనసాగింది.నిన్నటిదాకా నిస్తేజంగా యూరో మార్కెట్లు ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమయ్యాయి. పడటానికి ఏదో సాకు కోసం ఎదురు చూస్తున్న మన మార్కెట్లు ఇదే ఛాన్స్‌గా పతనమయ్యాయి. మూడు గంటల ప్రాంతానికి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15566కి చేరింది. తరవాత స్క్వేర్‌ ఆఫ్‌ కారణంగా స్వల్పంగా కోలుకున్నా 105 పాయింట్ల నష్టంతో 15,635 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల సూచీలు ఒకే స్థాయిలో నష్టపోయాయి. ఇటీవల బాగా పెరుగుతూ వచ్చిన షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. టెన్నికల్స్‌ పరంగా నిఫ్టికి సరిగ్గా 15800 వద్ద గట్టి ప్రతిఘటన ఎదురైంది.15,660 మార్కెట్‌కు అత్యంత కీలక స్థాయి అని ఉదయే టెక్నికల్స్‌ అనలిస్టులు హెచ్చరించారు. ఈ స్థాయి కంటే దిగువకు వస్తే భారీ నష్టాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే నిఫ్టి 15,566 స్థాయికి పడింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
పవర్‌ గ్రిడ్‌ 243.25 3.93
ఎస్‌బీఐ లైఫ్‌ 997.00 1.75
ఎన్‌టీపీసీ 118.00 1.55
టైటాన్‌ 1,727.50 0.88
కోల్‌ ఇండియా 157.20 0.77

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా మోటార్స్‌ 343.55 -2.61
అదానీ పోర్ట్స్‌ 853.00 -2.43
శ్రీ సిమెంట్‌ 28,370.90 -2.02
ఎల్‌ అండ్‌ టీ 1,520.80 -1.83
రిలయన్స్‌ 2,178.00 -1.65