For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ తన తొలి ప్రతిఘటన స్థాయిని తాకి నష్టాల్లోకి వెళ్ళింది. 15,772ను తాకిన తరవాత నిఫ్టి 15,723ని తాకి…. ఇపుడు 15,767కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 27 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఉదయం లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్ళి కోలుకుంది. నిఫ్టి ఒక రేంజ్‌లో మాత్రమే కదలాడే అవకాశముంది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ కూడా గ్రీన్‌లో ఉంది. ప్రత్యేక ఒక రంగమంటూ… ఎందులోనూ ర్యాలీ లేదు. అయితే సుగర్‌ షేర్లలో ఇవాళ కూడా ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టి మద్దతు, ప్రతిఘటన స్థాయిల మధ్యే ట్రేడ్‌ చేసి.. స్వల్ప లాభాలతో బయటపడటం మంచిది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
సిప్లా 972.80 2.00
ఓఎన్‌జీసీ 126.80 1.60
ఎస్‌బీఐ 431.70 1.05
కోల్‌ ఇండియా 157.60 1.03
దివీస్‌ ల్యాబ్‌ 4,282.75 0.98

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బ్రిటానియా 3,560.90 -1.13
శ్రీ సిమెంట్‌ 28,680.80 -0.95
అల్ట్రాటెక్‌ 6,737.20 -0.84
విప్రో 547.50 -0.56
మారుతీ 7,303.15 -0.46