For Money

Business News

నిఫ్టిని ప్రభావితం చేసే అంశాలు

రాత్రి వాల్‌స్ట్రీట్‌ డౌజోన్స్‌ అరశాతంపైగా నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌లో పెద్దగా మార్పుల్లేవ్. నిన్న అమెరికా మార్కెట్లలో బాండ్‌ ఈల్డ్స్‌ బాగా తగ్గాయి. ట్రెజరీస్‌లో భారీ షార్ట్‌ పొజిషన్స్‌ ఉన్నాయని మార్కెట్‌ అంచనా. 2018 తరవాత ఈ స్థాయిలో షార్ట్‌ పొజిషన్స్‌ ఉండటం ఇదే మొదటిసారి. ఇవాళ వచ్చే ద్రవ్యోల్బణ డేటా కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. ఇవాళ యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మీటింగ్‌ ఉంది. వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు కాని.. ఇతర నిర్ణయాల కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్‌ గ్రీన్‌లో ఉంది. దాదాపు అన్ని మార్కెట్లు అర శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. చైనా ఒక శాతంపైగా లాభంతో ఉంది. తైవాన్‌, సింగపూర్‌ ఒక శాతం దాకా లాభాల్లో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం స్వల్ప లాభాలతో ఉంది. సో… నిఫ్టి కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మార్కెట్‌ను దేశీయంగా ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేవు.