For Money

Business News

TS: సినిమా టికెట్ల ధరలు పెంపు

రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంపుపై రాష్ట్రం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆమోదం తెలిపింది. ఇక నుంచి తెలంగాణలో ఏసీ సినిమా థియేటర్లలో కనిష్ఠ ధర రూ. 50 కాగా, గరిష్ఠ ధర రూ.150గా నిర్ణయించారు. అదే మల్టిప్లెక్స్‌లో కనిష్ఠ ధర రూ. 100 కాగా, గరిష్ఠ ధర రూ.250. మల్టి ప్లెక్స్‌లలో రిక్లైనర్‌ సీట్లకు గరిష్ఠంగా రూ.300 వసూలు చేయొచ్చు. టికెట్ల ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనంగా ఉంటాయి. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్‌ ధరపై రూ. 5, నాన్‌ ఏసీ థియేటర్లలో రూ. 3 వసూలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అమ్మే టికెట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేయొచ్చు. కొత్త చార్జీలు అమల్లోకి వస్తే మల్టీ ప్లెక్స్‌ల్లో గరిష్ఠ ధర రూ. 250కి అదనంగా జీఎస్టీ ఉంటుందన్నమాట. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వసూలు చేసే కన్వీనియెన్స్‌ రుసం, నిర్వహణ చార్జీలు అదనంగా ఉంటాయి.