చిప్.. చిప్ హుర్రే
మళ్ళీ చిప్ షేర్లు రాణిస్తున్నాయి. రాత్రి అమెరికాలో వాల్‌స్ట్రీట్ ఓ మోస్తరు లాభాలతో ముగిసింది. అయితే ఏఐ రంగానికి చెందిన పలు కంపెనీలు అంచనాలకు మించి ఫలితాలు ప్రకటిచాయి. దీంతో నెబియస్ గ్రూప్ వంటి షేర్లు ఏకంగా 35 వాతం లాభడ్డాయి. అలాగే స్పేస్‌ఎక్స్ రాత్రి పది శాతం దాకా లాభంతో ముగిసింది. ఎన్‌విడియా షేర్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇక మైక్రాన్ షేర్లు కూడా రాత్రి 5 శాతం లాభపడ్డాయి. దీంతో మన ఐటీ షేర్లలో ఇవాళ కూడా లాభాల స్వీకరణకు ఛాన్స్ ఉంది. ఇక అమెరికా, ఇరాన్ మధ్య ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో 90 డాలర్ల ప్రాంతంలోనే బ్రెంట్ ఉంది. తాజా సమాచారం మేరకు బ్రెంట్ 88 డాలర్ల దిగువకు వచ్చింది. అయితే సీపీఐ డేటా అంచనాలకన్నా తక్కువగా ఉండటంతో ఇక వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరగవని వాల్‌స్ట్రీట్ భావిస్తోంది. దీంతో బులియన్‌లో జోరు కొనసాుతోంది. ఔన్స్ బంగారం ధర 4450 డాలర్లను దాటింది.
